Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోబ్రా కమాండర్ కోసం ముమ్మరంగా గాలింపు : సురక్షితంగా ఉన్నాడంటూ మావోల లేఖ

Advertiesment
Chhattisgarh Naxalite Attack
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (12:39 IST)
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ మన్‌హాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మావోయిస్టులు చెబుతున్నట్లుగా నిజంగానే అతడు వారి చెరలో ఉన్నాడా? మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు? అన్న విషయాలు తెలుసుకునేందుకు పోలీస్ ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను యాక్టివ్ చేశారు. 

అలాగే, ఎన్‌కౌంటర్ జరిగిన సమీప గ్రామాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించినా రాకేశ్వర్ జాడ తెలియలేదని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. దీంతో అతడు మావోయిస్టుల చెరలోనే ఉండి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, సుక్మా జిల్లాలో మారణకాండ సృష్టించిన 3 రోజుల తర్వాత మావోయిస్ట్‌ల పేరిట ఓ లేఖ విడుదలైంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ లేఖలో రాసి ఉంది. మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ను అప్పగిస్తామని దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరిట లేఖలో ప్రకటించారు. ఎ

దురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. చనిపోయినవారి పేర్లు నూపో సురేశ్, ఓడి సన్నీ, కోవాసి బద్రు, పద్దమ్ లఖ్మాగా పేర్కొంది. మావోయిస్టుల మెరుపు దాడిలో పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోపాటు మరణించిన మావోయిస్టుల చిత్రాలను కూడా విడుదల చేశారు. 

23 మంది జవాన్లు మృతి చెందారనేది మావోయిస్ట్‌ల వాదన. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందే జీరగూడెంలో మాడ్వి సుక్కా అనే గ్రామస్థున్ని పోలీసులు పట్టుకొని కాల్చేశారని ఆరోపించింది. సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో వివిధ గ్రామాలపై దాడి జరిపేందుకు బస్తర్‌లోని ఐజీ పి. సుందర్‌రాజ్‌ నేతృత్వంలో ఏప్రిల్ 3న 2,000 మంది జవాన్లు ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. 

అందుకే తాము ఎదురుదాడికి దిగామని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వంలో 2020 ఆగస్టులో దిల్లీలో జరిగిన సమావేశంలో ‘ఆపరేషన్‌ ప్రహార్‌- ఆపరేషన్‌ సమాధాన్‌’ ప్రణాళిక రూపొందించినట్టు మావోయిస్ట్‌ల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు పేజీలతో ఓ సుధీర్ఘ లేఖను విడుద చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ సాయంతో బాలికపై అత్యాచారం.. ఆర్నెల్ల గర్భవతిని చేసిన కామాంధుడు