కట్నం, కూలర్, ఫ్రిజ్ కావాలన్నాడు.. పెళ్ళైన మర్నాడే భర్తను జైలుకు పంపేసింది..
కట్నం కావాలన్నాడు. ఎండలు మండిపోతుంటే.. పుట్టింటి నుంచి కూలర్ తెమ్మన్నాడు. ఐస్ వాటర్ తాగేందుకు ఫ్రిజ్ కావాలన్నాడు. అంతే.. తల వంచుకని తాళి కట్టించుకున్న నవ వధువు మరుసటి రోజో భర్తను జైలుకు పంపించింది. ఈ
కట్నం కావాలన్నాడు. ఎండలు మండిపోతుంటే.. పుట్టింటి నుంచి కూలర్ తెమ్మన్నాడు. ఐస్ వాటర్ తాగేందుకు ఫ్రిజ్ కావాలన్నాడు. అంతే.. తల వంచుకని తాళి కట్టించుకున్న నవ వధువు మరుసటి రోజో భర్తను జైలుకు పంపించింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్‌లోని కోరియా జిల్లాలోచోటుచేసుకుంది. భర్త కట్నం అడగడంతో పుట్టింటికెళ్లి తల్లిదండ్రుల ముందు ఏడ్చుకోకుండా.. భర్తను జైలుకు పంపిన నవవధువు ధైర్యమైన నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, కోరియా పట్టణానికి చెందిన యువతికి, సమీప గ్రామంలోని ఓ యువకుడికి సోమవారం నాడు వివాహమైంది. పెళ్లి సందర్భంగా ముందుగా అనుకున్న కట్న కానుకలన్నింటినీ వధువు కుటుంబం సమకూర్చింది. పెళ్లైన తర్వాతే వరుడిలోని మరో రూపం బయటపడింది.
అదనపు కట్నంతో పాటు కూలర్, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పుట్టింటి నుంచి తెమ్మన్నాడు. ఇప్పట్లో అవన్నీ ఇవ్వలేమని పెద్దమనుషులతో చెప్పించినా వరుడు పట్టించుకోలేదు. కొన్ని గంటలపాటు వరుడి వాలకాన్ని చూసిన నవవధువు.. ఇక లాభం లేదనుకుంది. వరుడిని పోలీసులకు అప్పగించింది. కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తాళి కట్టిన రోజే కట్నకానుకలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేసింది. అంతే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.