Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై వరదల్లో బెంగళూరు ఆపన్నహస్తం... కావేరిపై చెన్నై ఆర్జే బాలాజీ స్పీచ్, 11 లక్షల వ్యూస్

ఆర్జె, చెన్నై ఆర్జే బాలాజీ అంటే చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇపుడీ చెన్నై ఆర్జే కావేరీ సమస్యపైన తనే ఓ వీడియో షూట్ చేసి దాన్ని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలోకి విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన ఈ వీడియోను 11 లక్షల మంది వీక్షించారు.

Advertiesment
#Cauvery Issue
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (13:34 IST)
ఆర్జె, చెన్నై ఆర్జే బాలాజీ అంటే చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇపుడీ చెన్నై ఆర్జే కావేరీ సమస్యపైన తనే ఓ వీడియో షూట్ చేసి దాన్ని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలోకి విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన ఈ వీడియోను 11 లక్షల మంది వీక్షించారు. 
 
ఈ వీడియోలో చెన్నై ఆర్జే బాలాజీ మాట్లాడుతూ... ఇప్పుడు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నది నీలాంటి లేదంటే నాలాంటి సామాన్య జనం కాదు. రాజకీయ లబ్ది కోసం పనిగట్టుకుని విధ్వంసానికి పాల్పడుతున్న కొంతమంది. చెన్నైలో గత ఏడాది భారీ వరదలతో అతలాకుతలం అయితే బెంగళూరు వాసులు కదిలివచ్చారు. చెన్నై నగరానికి అయిన గాయాన్ని మాన్పేందుకు వారు ఎంతగానో కృషి చేశారు. 
 
ఇప్పుడు కూడా వారంతా అలాంటి హృదయంతోనే ఉన్నారు. అలాగే చెన్నైలో ఉడ్ ల్యాండ్స్ హోటల్ పైన దాడి చేసింది కూడా సామాన్య తమిళ పౌరులు కాదు. కొన్ని స్వార్థపర శక్తులు. కాబట్టి ఏవో కొన్ని స్వార్థపర శక్తులు చేసే పనులపై మనం ఉద్వేగం పడవద్దు. నగరాల్లో ప్రశాంతమైన జీవితం కోసమే మనం పాటుపడదాం అంటూ బాలాజీ తన వీడియోలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఫోటోలపై రాసుకోవచ్చు.. డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు..