63 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. బాలిక ఇంట్లోనే అద్దెకు వుంటున్న ఈ పెద్ద మనిషి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. మెడికల్ టెస్ట్‌ల తర్వాత ఆ బాలిక ప్రెగ్నెన్సీ అన్న విషయం బయటపడింది. దీంతో డాక్టర్, ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లెయింట్ చేశారు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లైంగిక నేరాల నుంచి బాలల నిరోధక చట్టం (పోక్సో) కింద అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని శుక్రవారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.