Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏసీ ఆన్ చేసి కారులోనే విశ్రాంతి.. నవ వధువుతో పాటు తల్లిదండ్రులు నిప్పుకు బలి.. ఎలా?

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా

ఏసీ ఆన్ చేసి కారులోనే విశ్రాంతి.. నవ వధువుతో పాటు తల్లిదండ్రులు నిప్పుకు బలి.. ఎలా?
, సోమవారం, 29 మే 2017 (13:25 IST)
తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని చిట్లపాక్కంకు చెందిన ఆడిటర్ జయదేవన్ (45), ఆయన భార్య రమాదేవి, వీరి కుమార్తె దివ్యశ్రీలు సజీవదహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు. జయదేవన్ సతీమణి రమాదేవి టీచర్‌గా పని చేస్తుండగా, దివ్యశ్రీకి ఇటీవలే వివాహం జరిగింది. దివ్యశ్రీ భర్త విదేశాలకు వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాబలిపురం సమీపంలోని ఓ స్థలం చూసేందుకు జయదేవన్ తన భార్య రమాదేవి, కుమార్తె దివ్యశ్రీతో కలిసి వెళ్లారు.
 
ఎండలు మండిపోతుండటంతో స్థలం చూసిన తర్వాత ముగ్గురు కారులోనే విశ్రాంతి తీసుకుంటున్నారని.. ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతులను గుర్తించారు. 
 
ఏసీ మిషన్ పేలి మంటలు వ్యాపించడంతోనే జయదేవన్ ఫ్యామిలీ నిప్పుకు ఆహుతి అయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నవ వధువు మృతి చెందడం.. నిద్రిస్తున్న కారులో మంటలు వ్యాపించడం వెనుక వేరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో ఇద్దరమ్మాయిలపై పోకిరీల అకృత్యాలు.. తాకరాని చోట తాకుతూ.. తడుముతూ వీడియో