దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్న దక్ష అనే ఆడ చిరుత మరణించింది. మార్చి 27న, ఏప్రిల్ 23న ఇప్పటికే ఓ ఆడ ఓ మగ చిరుత మరణించాయి. ప్రస్తుతం మూడోదిగా ఆడ చిరుత చనిపోయింది. మానిటరింగ్ బృందం ఉదయాన్నే గాయపడిన స్థితిలో వున్న దక్షను గుర్తించి వైద్య సహాయం అందించారు.
కానీ దక్ష మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇలా కునో నేషనల్ పార్కులో వరుసగా ఇలా విదేశాల నుంచి చిరుతలు మరణించడంపై పార్కు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
చిరుతల సంతతి అంతరించడంతో.. భారత అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుండి దేశానికి చిరుతలను తరలించే ప్రక్రియకు సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. అయితే దేశానికి చేరిన ఆఫ్రికా చిరుతలు మరణించడంపై సర్వత్రా చర్చ మొదలైంది.