Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రయాన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు

prakash raj cartoon
, సోమవారం, 21 ఆగస్టు 2023 (18:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. చంద్రుడిపై నుంచి పంపిన తొలి ఫోటో ఇదేనంటూ ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఉన్న కార్టూన్‌ను ఆయన షేర్ చేశారు. ఇది చొక్కా, లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ పోస్తున్నట్టుగా ఈ కార్టూన్ ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు ప్రకాష్ రాజ్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారతీయ జనతా పార్టీపై ప్రకాష్ రాజ్‌కు ఉన్న ద్వేషాన్ని ఇస్రో శాస్త్రవేత్తలపై చూపుతున్నారంటూ మండిపడ్డారు. మరికొందరు అయితే, ప్రకాష్ రాజ్‌ను మరింత దారుణంగా ట్రోల్ చేశారు. 
 
ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ఆయన దేశ శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారంటూ, చారిత్రాత్మక మిషన్‌ను అపహాస్యం చేశారంటూ విమర్శించారు. రాజకీయాలకు, దేశాన్ని విమర్శించడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తించాలని సూచించారు. బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై గుడ్డి ద్వేషం కారణంగానే ఆయన ఈ పోస్టు చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తల కృషిని ఎగతాళి చేసేలా ట్వీట్ చేశాడంటూ విరుచుకుపడ్డారు. చంద్రయాన్-3 దేశానికి గర్వకారణం. అంతేతప్ప.. ప్రకాష్ రాజ్ గుడ్డి ద్వేషానికి సాధనం కాదు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 
 
ఏపీలో దిగజారిపోయిన సీఎం జగన్ పాలన : సినీ నటుడు పృథ్వీరాజ్  
 
ఏపీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా దిగజారిపోయి అధ్వాన్నంగా తయారైందని జనసేన పార్టీ నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లును ఆదివారం సందర్శించింది. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. 
 
'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్ర గురించి ప్రశ్నించగా దర్శకుడు చెప్పిన పాత్రలో నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బానోతు కొండ, గోంగూర శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లులో ఆదివారం సందడి చేసింది. టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వచ్చి విలేకరులతో మాట్లాడారు. కథానాయికగా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారని, చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు. హీరో కాంతి, కథానాయిక శ్రీలు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం