Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తులో స్నేహితురాలికి తాళి కట్టిన వరుడు... చెంప ఛెళ్లుమనిపించిన వధువు..

Advertiesment
drunk bride groom

ఠాగూర్

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:46 IST)
వివాహాల సమయంలో కొందరు పీకల వరకు మద్యం సేవిస్తారు. ఆ తర్వాత పెళ్లి పీటలపై కూర్చొని చేయకూడని పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వరుడు.. ఫుల్లుగా మద్యం వేవించడంతో కైపు నషాళానికి ఎక్కింది. దీంతో వధువు మెడలో వేయాల్సిన మంగళసూత్రం.. ఆమె స్నేహితురాలి మెడలో వేశాడు. అంతే.. వధువుకు ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. చెంప ఛెళ్ళుమనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వధువు పేరు రాధాదేవి. ఆమె వయసు 21 యేళ్లు. వరుడు పేరు రవీంద్ర కుమార్. వయసు 26 యేళ్లు. భారీ ఊరేగింపు మధ్య పెళ్లి వేదిక వద్దకు ఆలస్యంగా వచ్చిన వరుడు... తాగిన మైకంలో వధువు మెడలోకాకుండా పక్కనే ఉన్న వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. 
 
వరుడు కుటుంబం అదనపు కట్నం డిమాండ్ చేయగా, వధువు ఫ్యామిలీ తాము ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో వరుడు కావాలనే తాగి పెళ్లికి వచ్చినట్టు తెలిసింది. పెళ్లి కుమార్తె తండ్రికి పెళ్లికి ముందు రూ.2.5 లక్షలు, పెళ్లి రోజు రూ.2 లక్షలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని పెళ్లి కుమారుడు, తన ఫ్రెండ్‍తో కలిసి తాగి పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. 
 
తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వరుడు, స్నేహితులతో తాగి వచ్చి కావాలని వధువు ఫ్యామిలీతో అమర్యాదగా ప్రవర్తించినట్టు పోలీసులు తెలిపారు. పూలమాలను మార్చుకునే సమయంలో అనుకోకుండా పెళ్లి కుమార్తె మెడలో కాకుండా, ఆమె పక్కనే ఉన్న మరో అమ్మాయి మెడలో మాలను వేశాడు. 
 
దీంతో ఆగ్రహించిన రాధాదేవి, వరుడి చెంపపై కొట్టి, అక్కడ నుంచి వెళ్లిపోయింది. అతన్ని పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. వరుడు రవీంద్ర కుమార్‌పై వధువు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)