Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాహనదారుల కోసం కేంద్రం కొత్త రూల్స్!

Advertiesment
Center
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:06 IST)
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యాజమానులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలో పేరు, చిరునామా మార్పు లాంటీ 15 రకాల సేవలను ఇక సుంచి సులభంగా ఆన్‏లైన్‏లోనే చేసుకోవచ్చు.

ఈ సేవలు ఉపయోగించుకోవడానికి ఆధార్ తప్పనిసరి కానుంది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ రూల్ చాలా వాటికి వర్తింపచేయనున్నారు. ఈ సేవలతో వాహనాదారులు గంటల తరబడి ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్ళి క్యూలో నిల్చోని ఇబ్బందులు పడే అవస్థలు తప్పనున్నాయి.
 
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఆధార్ ఉండాల్సిందే. ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా పలు రకాల సేవలకు రానున్న రోజుల్లో ఆధార్ తప్పనిసరి కాబోతోంది.

ఆధార్ వెరిఫై చేసుకోకపోతే మీరు ఏ సర్వీసులు పొందాలనుకున్నా కానీ ఆర్టీఓ ఆఫీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ అమలు చేయడం వలన..నకిలి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈజీగా దొరికిపోతారు. ఇక అదే సమయంలో వాహనదారులకు బెనిఫిట్ ఉంటుంది.

ప్రతి చిన్న పనికి ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు కచ్చితంగా తీసుకోవాలి. ఆధార్ ఎన్ రోల్ మెంట్ నంబర్ ఇచ్చిన సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే.. జగన్ భార్య భారతికి రాజకీయ ఆకాంక్ష: గోనె ప్రకాశ్