Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెంటు బిల్లు.. నీటి బిల్లు చెల్లించకుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.. నిజమా?

భారత ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కరెంటు, నీరు, టెలిఫోన్‌ బిల్లులను చెల్లించకుండా ఎగవేసేవారు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని ఎన్నికల సంఘం (ఈసీ

Advertiesment
CEC Dr Nasim Zaidi
, సోమవారం, 6 మార్చి 2017 (08:58 IST)
భారత ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కరెంటు, నీరు, టెలిఫోన్‌ బిల్లులను చెల్లించకుండా ఎగవేసేవారు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని ఎన్నికల సంఘం (ఈసీ) భావిస్తోంది. ఇందుకోసం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. 
 
ఈ మేరకు ఎన్నికల నేరాలను అడ్డుకునే ఈ చట్టంలోని మూడో చాప్టరును సవరించాలని న్యాయశాఖకు ఎన్నికల సంఘం సూచన చేసింది. నిజానికి.. తమ ఇంటికి కరెంటు, నీరు, ఫోన్‌ కనెక్షన్లు సమకూర్చిన సంస్థల నుంచి ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’ను అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించేలా చూడాలని, పదేళ్లుగా ప్రభుత్వ భవనాల్లో నివసిస్తున్న అభ్యర్థులు కూడా అద్దె బకాయి లేరన్న ధ్రువపత్రాన్నీ సమర్పించాలని, ఎన్నికల్లో పోటీచేయదలచినవారు తప్పనిసరిగా ఈ బకాయిలన్నీ చెల్లించి తీరాలని 2015 ఆగస్టులోనే ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 
 
దీనికి అనుగుణంగా ఎన్నికల సంస్కరణలు తేవడానికి గత యేడాది మార్చిలో ఈసీ రాజకీయ పార్టీలతో భేటీ అయింది. ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’ నిబంధనతో అవినీతి పెరిగిందని, లంచాలు తీసుకుని ఆ సర్టిఫికెట్‌ పొందుతున్నారని పార్టీలు ఈసీకి తెలిపాయి. దీంతో తమ అభ్యర్థులు డీఫాల్టర్లు కాదని, ఎలాంటి బకాయిలూ చెల్లించనవసం లేదంటూ పార్టీలే ఓ అఫిడవిట్‌ సమర్పించాలని ఈసీ ఇటీవల ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీఈసీ నయీం జైదీ మళ్లీ తెరపైకి తెచ్చారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానాల్లోనూ టాయ్‌లెట్ కంపే.. స్వచ్చభారత్ అంతవరకు పాకింది.. ఏం దరిద్రమో...