Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీబీఐ వలకు చిక్కిన సీనియర్ సివిల్ జడ్జి.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ..

ఆ వ్యవస్థ… ఈ వ్యవస్థ అని కాదు దేశంలోని అన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. ఏదైనా పని జరగాలంటే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన ఓ ఘటన అందరిని అబ్బురపరిచిం

సీబీఐ వలకు చిక్కిన సీనియర్ సివిల్ జడ్జి.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ..
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:45 IST)
ఆ వ్యవస్థ… ఈ వ్యవస్థ అని కాదు దేశంలోని అన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. ఏదైనా పని జరగాలంటే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన ఓ ఘటన అందరిని అబ్బురపరిచింది. న్యాయవ్యవస్థను కూడా అవినీతి చీడ వదలడం లేదు. ఢిల్లీలోని ఓ సీనియర్ సివిల్ జడ్జి.. సీబీఐ అధికారుల వలకు చిక్కింది. తీస్ హజారీ కోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆమె.. ఓ న్యాయవాది వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది. 
 
ఢిల్లీలోని తీస్ హజారీకోర్టులో రచనా తివారీ లఖన్ పాల్‌ సివిల్ జడ్జిగా పనిచేస్తోంది. ఓ కేసులో ఆమె ద్వారా స్థానిక కమిషనర్‌గా నియమితుడైన న్యాయవాది వద్ద నుంచి 20 లక్షల రూపాయలు ఆమె లంచం డిమాండ్ చేసింది. అనంతరం ఆమె నివాసం నుంచి సోదాల సందర్భంగా రూ.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కేసు విషయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

జడ్జి తరఫున రూ.20 లక్షలు, తనకు మరో రూ.2 లక్షలు తనకు ఇవ్వాలని న్యాయవాది మెహన్ డిమాండ్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. రచనా తివారీని కాంపిటెంట్‌ కోర్టు ముందు హాజరుపరచనున్నారు సీబీఐ అధికారులు. కోర్టు ఆదేశం అనంతరం ఈ కేసులో ఆమెను విచారించే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత సైన్యంతో పెట్టుకుంటే అంతే సంగతులు : సుశీల్ కుమార్ షిండే.. ట్విట్టర్లో ప్రశంసలు..