Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆ నిర్ణయం ఖరీదు రూ.2 కోట్లు'.. అడ్డంగా దొరికిన దర్యాప్తు సంస్థ అధికారి

ఒక నిర్ణయం ఖరీదు రూ.2 కోట్లు. ఇంత మొత్తంలో లంచం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడంతో తీర్పు అనుకున్నట్టుగానే అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. ఒప్పందం మేరకు రూ.2 కోట్ల లంచం పుచ్చుకున్న ద

Advertiesment
'ఆ నిర్ణయం ఖరీదు రూ.2 కోట్లు'.. అడ్డంగా దొరికిన దర్యాప్తు సంస్థ అధికారి
, గురువారం, 4 మే 2017 (10:18 IST)
ఒక నిర్ణయం ఖరీదు రూ.2 కోట్లు. ఇంత మొత్తంలో లంచం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడంతో తీర్పు అనుకున్నట్టుగానే అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. ఒప్పందం మేరకు రూ.2 కోట్ల లంచం పుచ్చుకున్న దర్యాప్తు సంస్థ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎస్సార్‌ గ్రూప్‌ ప్రధాన ధర్మకర్త(ట్రస్టీ)గా ఉన్న బాలాజీ ట్రస్ట్‌ కొనసాగుతోంది. ఈ ట్రస్ట్‌కు ఆదాయ పన్నుకు సంబంధించిన వివాదం తలెత్తింది. ఈ కేసులో ట్రస్ట్‌కు అనుకూలమైన నిర్ణయం వెలువరిస్తే రూ.2 కోట్లు లంచంగా పొందేలా ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ అప్పీల్స్‌ విభాగ కమిషనర్‌గా ఉన్న బి.బి.రాజేంద్ర ప్రసాద్‌‌తో ఎస్సార్ గ్రూపు ఎండీ ప్రదీప్ మిట్టల్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, ఇరువర్గాల వాదోపవాదాలు ఆలకించిన అప్పీల్ విభాగం.. వాస్తవాలకు విరుద్ధంగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు... బాలాజీ ట్రస్ట్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆ తర్వాత రూ.2 కోట్ల లంచాన్ని దశలవారీగా లంచం మొత్తాన్ని ట్రస్ట్‌ తరపు వ్యక్తులు చేరవేస్తున్నారు. ఇదే క్రమంలో ట్రస్ట్‌ తరపున ముంబైకి చెందిన ఓ స్థిరాస్తి ఏజెంట్‌ బంధువు నుంచి విశాఖలోని వారి ఏజెంట్‌కు నగదును బదిలీ అయ్యింది. ముంబై నుంచి వచ్చిన రాజేంద్రప్రసాద్‌కు ఆ ఏజెంట్‌ రూ.19.34 లక్షలను అందజేస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. 
 
అనంతరం కమిషనర్‌ రాజేంద్రప్రసాద్‌ ఇంటిని తనిఖీ చేయగా రూ.1.50 కోట్ల నగదు కూడా లభించింది. ఈ సొమ్మంతా లంచంగా స్వీకరించిందేనని సీబీఐ అధికారులు నిర్ధరించుకున్నారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు మరో ఐదుగురిని కూడా అరెస్ట్‌ చేశారు. అలాగే, ఎస్సార్ గ్రూపు ఎండీ ప్రదీప్ మిట్టల్‌ను కూడా అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క మూత్రం పోసింది. గొడవ మొదలైంది.. కాల్పుల వరకు వెళ్లింది