Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కావేరి వివాదంపై ఇదే ఫైనల్ తీర్పు.. మరో 15 యేళ్ల మార్చడానికి వీల్లేదు

దాదాపు 120 యేళ్ళుగా సాగుతూ వచ్చిన కావేరి నదీ జల వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ జల సమస్యపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం త

Advertiesment
కావేరి వివాదంపై ఇదే ఫైనల్ తీర్పు.. మరో 15 యేళ్ల మార్చడానికి వీల్లేదు
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:58 IST)
దాదాపు 120 యేళ్ళుగా సాగుతూ వచ్చిన కావేరి నదీ జల వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ జల సమస్యపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి 177.25 టీఎంసీలు నీటిని మాత్రమే విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు తెలిపింది. తాజా తీర్పు వల్ల కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు లభించనుంది. 
 
కావేరీ జలాల వివాదంపై తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం కావేరీ జల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌(సీడబ్ల్యూడీటీ)ని ఏర్పాటుచేసింది. ఈ ట్రైబ్యునల్‌ 2007లో తీర్పు చెప్పింది. కావేరీ జలాలను 740 టీఎంసీలుగా లెక్కించి.. తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు కేటాయించింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరిచింది. 
 
కాగా, 2007 ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం.. తమిళనాడుకు ఇప్పటికే 227 టీఎంసీల నీటిని విడుదల చేయగా.. ఇంకా 192 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే మిగతా 192 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలున్నాయి. ఈ తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తమిళనాడుకు రావాల్సిన వాటాను తగ్గించింది. శుక్రవారం వెలువరించిన తీర్పులో తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.
 
దీంతో కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు మిగలనుంది. అయితే కేరళ, పుదుచ్చేరి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాగే, కావేరీ జలాలపై ఏ రాష్ట్రానికి హక్కు లేదనీ, ఈ తీర్పే ఫైనల్ అని, మరో 15 యేళ్ల పాటు ఈ తీర్పును మార్చడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే.. పేరుకే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి.. ఇలా చేశారేంటి?