Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కావేరి జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు.. బెంగళూరులో 144 సెక్షన్..

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించింది. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల

Advertiesment
Cauvery dispute: Section 144 imposed in Bengaluru till 30 September following SC order
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:22 IST)
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించింది. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. కావేరిలోనే నీరు లేనప్పుడు వారికి మాత్రం ఎలా విడుదల చేయాలని సీఎం సిద్ధరామయ్య సైతం ఫైర్ అయ్యారు. 
 
ఇప్పుడు కావేరీ జలాలను తమిళనాడుకు ఈనెల 23వ తేది వరకు వదిలేది లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల 23వ తేది తరువాత ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలుస్తామని.. ఆరోజు కావేరీ జలాల పంపిణిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో బెంగళూరులో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆదేశాలు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో వుంటాయి. కాగా, రోజుకి 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్నది సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు. 28, 29 తేదీల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా రిజర్వాయర్లను తెరిచి ఉంచాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీమ్ కేసు.. అనుచరులందరూ గన్‌లను సరెండర్ చేయండి.. తెలంగాణ సర్కారు ఆర్డర్