కొండ చిలువ జింకను మింగేసింది.. పొట్టకు సరిపోక.. మృత్యువాత పడింది..
అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేస
అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో 20 అడుగుల పొడవైన కొండచిలువ పెద్ద కృష్ణ జింకను మింగింది. ఆ తర్వాత కదలలేక రోడ్డుపై పక్కన పడి నానా అవస్థలు పడింది. దాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఓ ఎన్క్లోజర్లో ఉంచారు.
అయితే స్థాయికి మించిన ప్రాణిని అది మింగడంతో జీర్ణించుకోలేక మృత్యువాత పడింది. సాధారణంగా కొండచిలువలు ఏదైనా జంతువును మింగితే అది జీర్ణం కావడానికి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలకుపైగా పట్టవచ్చు. అప్పటి వరకు అవి ఆహారం తీసుకోవు. అలాంటిది జింకను మింగితే కొండచిలువ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జింకను మింగేసిన కొండచిలువ నానా తంటాలు పడి చివరకుడ ప్రాణాలు విడిచింది.