Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేషన్ కార్డుదారులకు శుభవార్త: నవంబర్ వరకు ఉచిత రేషన్

రేషన్ కార్డుదారులకు శుభవార్త: నవంబర్ వరకు ఉచిత రేషన్
, గురువారం, 24 జూన్ 2021 (16:37 IST)
ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. ప్రధాన్ మంత్రి గరీభ్​ కల్యాణ్​​ యోజన (PMGKAY) పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ అందిస్తారు. 
 
కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్​ సౌలభ్యాన్ని పొడిగించటం వరుసగా ఇది నాలుగోసారి. గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు. 
 
లబ్దిదారులైన ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రానికి రూ.64,031కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.
 
కాగా, ఈ నెల ప్రారంభంలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ..దీపావళి వరకు పేదలకు ఉచిత రేషన్​ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఇవాళ (జూన్-23,2021) మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవాగ్జిన్‌కు పూర్తిస్థాయి లైసెన్స్ నిరాకరణ : డీసీజీఐ