Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... సభకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌కు వచ్చారు. సంప్రదాయ అశ్విక దళం వెన్నంటి రాగా, జోడు గుర్రాల బగ

Advertiesment
Budget Session 2017 LIVE
, మంగళవారం, 31 జనవరి 2017 (10:48 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌కు వచ్చారు. సంప్రదాయ అశ్విక దళం వెన్నంటి రాగా, జోడు గుర్రాల బగ్గీపై ప్రణబ్ ప్రయాణం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ వరకూ సాగింది. 
 
పార్లమెంట్ సెంట్రల్ హాల్ వద్దకు వచ్చిన ప్రణబ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. పలువురు నేతలకు ఆయన అభివందనం చేస్తూ లోనికి వచ్చారు. ఆ తర్వాత సభ్యులను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి ఐదేళ్ళ కఠిన శిక్ష: పోక్సో కోర్టు తీర్పు