Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన పేరు బజ్మీ సిద్దిఖీ. ఈయనతో పాటు ఆయన ఆరుగురు అనుచరుల తనపై సామూహిక లైంగిక దాడికి పా

Advertiesment
BSP's Ayodhya candidate
, ఆదివారం, 5 మార్చి 2017 (11:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన పేరు బజ్మీ సిద్దిఖీ. ఈయనతో పాటు ఆయన ఆరుగురు అనుచరుల తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిఖీ ఐదుగురు అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సిద్దిఖీ, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
దీనిపై సిద్ధిఖీ స్పందిస్తూ రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ గాలి వీస్తోందని, అయోధ్యలో తాను విజయం సాధిస్తానని ప్రత్యర్థి పార్టీలు తనపై కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. శనివారం రాత్రి సిద్దిఖీ ఆయన అనుచరులు ఫైజాబాద్‌లో తన ఇంట్లోకి బలవంతంగా వచ్చి దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను చితకబాదారాని బాధితురాలు ఆరోపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ మేనకోడలు దీప భార్యాభర్తల మధ్య చిచ్చు.. పేరవై నుంచి వైదొలగిన మాధవన్