Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాస్‌ను అడిగిన జస్ట్ 10 నిమిషాల్లో గాల్లో కలిసిపోయిన ఉద్యోగి ప్రాణాలు

Advertiesment
Heart Attack

ఠాగూర్

, సోమవారం, 15 సెప్టెంబరు 2025 (09:31 IST)
తన బాస్‌ను సెలవు అడిగిన కేవలం పది నిమిషాల్లో ఓ ఉద్యోగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటన జీవితం ఎంత అనూహ్యమైనదో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శంకర్ (40) అనే ఉద్యోగి తన పైఅధికారి అయిన కేవీ అయ్యర్‌కు ఉదయం 8:37 గంటలకు ఒక మెసేజ్ పంపారు. "సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను. ఈ రోజు ఆఫీసు రాలేను. దయచేసి సెలవు మంజూరు చేయండి" అని అందులో కోరారు. 
 
ఇది సాధారణంగా వచ్చేదే కావడంతో అయ్యర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ సందేశం పంపిన పది నిమిషాలకే, అంటే ఉదయం 8:47 గంటలకు శంకర్ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.
 
ఈ విషాద వార్త ఉదయం 11 గంటల సమయంలో అయ్యర్‌కు తెలిసింది. తన సహోద్యోగి ఇక లేరని తెలిసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉదయం తనతో మాట్లాడిన వ్యక్తి కొద్దిసేపటికే మరణించాడన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోయారు.
 
ఈ విషయాన్ని అయ్యర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని శంకర్ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం నమ్మలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

JP Nadda In AP: వైకాపా విధానాలు అంధకారంలోకి నెట్టాయి.. జేపీ నడ్డా