ఉత్తరకాశీలో విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురి కోసం బుధవారం నుండి అవిశ్రాంతంగా IAF చీతా, Mi 17 IV హెలికాప్టర్లు పనిచేశాయి. చివరికి మిగిలిన నలుగురు ట్రెక్కర్‌ల మృతదేహాలను వెలికి తీశాయి.
ప్రమాదం నుండి బయటపడిన వారిని తదుపరి సంరక్షణ, కోలుకోవడం కోసం సమీపంలోని వైద్య కేంద్రానికి కూడా విమానంలో తరలించారు. బుధవారం ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మంచు తుఫాన్‌లో చిక్కుకున్న 22 మంది ట్రెక్కర్లులో హెలికాప్టర్ సహాయంతో 13 మందిని కాపాడారు.
ట్రెక్కర్లు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. సహస్రతల్ ప్రాంతంలో ఘటన జరిగింది. కర్ణాటక ట్రెక్కింగ్ అసోసియేషన్‌కు చెందిన 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీలోని సిల్లా గ్రామం నుండి సహస్త్రాల్‌కు బయలుదేరింది. భట్వాడి మల్లా-సిల్లా-కుష్కల్యాణ్-సహస్త్రాటల్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఐదుగురు ట్రెక్కర్లు మరణించారు.