Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఫ్‌పై బ్యాన్ చేశారు.. బీర్ షాపును ప్రారంభించారు: యూపీ మహిళా మంత్రి నిర్వాకం.. సీఎం యోగి మండిపాటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు బీఫ్‌పై నిషేధం విధించారు. మరోవైపు బీరు బారులను ప్రారంభిస్తున్నారు. దీనిపై ఆ రాష్ట్ర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తన మంత్రివర్గంలో ఉండే ఓ మహిళా మంత్రి తనకు తెలియకుండా

Advertiesment
బీఫ్‌పై బ్యాన్ చేశారు.. బీర్ షాపును ప్రారంభించారు: యూపీ మహిళా మంత్రి నిర్వాకం.. సీఎం యోగి మండిపాటు
, మంగళవారం, 30 మే 2017 (10:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు బీఫ్‌పై నిషేధం విధించారు. మరోవైపు బీరు బారులను ప్రారంభిస్తున్నారు. దీనిపై ఆ రాష్ట్ర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తన మంత్రివర్గంలో ఉండే ఓ మహిళా మంత్రి తనకు తెలియకుండానే బీర్ బార్‌ను ప్రారంభించడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
 
ఇంతకీ బీరు బారును ప్రారంభించిన మహిళా మంత్రి పేరు స్వాతి సింగ్. యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఒక్క పనితో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... 'బీ ద బీర్‌' అనే పేరుగల లగ్జరీ బార్‌ను ఆమె ప్రారంభించారు. ఈ మేరకు ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. బీఫ్‌ను బ్యాన్ చేసిన బీజేపీ ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ఓ బీర్ దుకాణాన్ని ఓపెన్ చేయడం ఆ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతోంది.
 
బీఫ్‌ను బ్యాన్‌ చేసి.. బీర్‌ను పొంగిస్తున్నారు.., ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు.. మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు.., ముసుగు తొలిగిస్తే కనబడే బీజేపీ అసలు ముఖం ఇదే.., స్వాతి మేడమ్‌ ఏమిటీ పని.. అంటూ మంత్రి భుజం మీదుగా బిజెపి, యోగిలపై నెటిజన్లు విమర్శలు సంధింస్తున్నారు.
 
అంతా సాఫీగా జరుగిపోతున్నవేళ స్వాతి చర్యతో మొదలైన వివాదంపై సీఎం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. అసలా కార్యక్రమానికి ఎందుకు వెళ్లాల్సివచ్చిందో స్వాతిని వివరణ కోరినట్టు సమాచారం. అలాగే, అధికారులు కూడా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెల కోసం ప్రేమ కుటీరాలు... నచ్చితే అబ్బాయితో సహజీవనం...