పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి తేరుకోలని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం ముకుల్ రాయ్ తన కుమారుడు సుభ్రంగ్సు రాయ్‌తో కలిసి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత్ బెనర్జీ సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా హాజరయ్యారు. ఆయననే ముకుల్ రాయ్, ఆయన కుమారుడుకి టీఎంసీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది.
గత 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు. అయితే, ఎందుకో ఆయన కమలనాథులతో కలిసి పయనించలేక తిరిగి సొంతగూటికే చేరుకున్నారు.