పేద ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో భారత్‌లోకి అడుగుపెట్టిన మదర థెరిసా అసలు లక్ష్యం వెనుక మరో కుట్ర దాగివుందని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'భారతను క్రైస్తవ దేశంగా మార్చే కుట్రలో మదర్‌థెరిసా ఒక భాగంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆమె జీవించి ఉన్న సమయంలో జరిగిన పలు సంఘటనలే అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలకు ఆజ్యంపోశాయన్నారు. ఆ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితుల గురించి మీకు పూర్తిగా తెలియదు. అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు.
ఇకపోతే అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసినప్పుడు ఆరెస్సెస్ కరసేవకులను ఆపలేకపోయినవారు ఇప్పుడు రామమందిర నిర్మాణాన్ని మాత్రం ఎలా అడ్డుకోగలరని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ హయాంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.