Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యకు బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే గిఫ్ట్‌గా రూ.5.5 కోట్ల లగ్జరీ కారు.. కొద్దిసేపటికే యాక్సిడెంట్...

మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా-భయందర్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా తన భార్య సుమన్కు బర్త్ డే గిఫ్ట్గా రూ.5.5 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా తన శ్రీమతికి పుట్టిన రోజు శు

భార్యకు బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే గిఫ్ట్‌గా రూ.5.5 కోట్ల లగ్జరీ కారు.. కొద్దిసేపటికే యాక్సిడెంట్...
, బుధవారం, 31 ఆగస్టు 2016 (15:44 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా-భయందర్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా తన భార్య సుమన్కు బర్త్ డే గిఫ్ట్గా రూ.5.5 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా తన శ్రీమతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆ ఫోటోలను కూడా షేర్ చేశారు. పుట్టిన వేడుకును అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఈ దంపతులకు అనుకోని విధంగా షాక్ ఎదురైంది. 
 
లాంబోర్గిని సంస్థకు చెందిన ఈ కాషాయ రంగు కారు వల్ల జరిగిన యాక్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే... సుమన్ తన భర్త నరేంద్రను తీసుకెళ్లి కొత్తకారులో ట్రయల్ రన్కు వెళ్లారు. ఆమె తన భర్త కారు కొనిచ్చిన సంతోషంతో స్పీడ్గా వెళ్తూ నియంత్రణ కోల్పోయి.. ఓ స్కూల్ గేటు ముందు ఆపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా షాక్కు గురైన సుమన్ కారులోనే ఉండిపోగా, నరేంద్ర కారు దిగి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆటో మాత్రం నుజ్జు నుజ్జయ్యింది. కానీ... డ్రైవర్ సహా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆటోవాలాకు నష్టపరిహారం ఇచ్చి పంపించేశారు. దాంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జరిగిన ఘటనను చిన్నదిగా పరిగణించారు. తన భార్యకు కారు నడపడంలో 18 ఏళ్ల  అనుభవం ఉందని, ఆమె ఆడికారు సహా పలు విదేశీ కార్లను నడిపిందని గొప్పలు చెప్పుకొచ్చారు. కారు ఆటో ముందు భాగాన్ని తాకిందని, పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.

లాంబోర్గిని కారును స్థానిక మెకానిక్లు రిపేర్ చేయలేరని, స్కూల్ లోపల పార్క్ చేశామని తెలిపారు. అదృష్టవశాత్తు ఆ ఆటోలో ఎవరూ లేరు కాబట్టి ఎటువంటి కేసులు లేకుండా బయటపడ్డారు. మరి, జరగరానిది ఏదైనా జరిగి ప్రాణాలెవరివైనా గాల్లో కలిసి పోయి ఉంటే.. అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు తన శ్రీమతి డ్రైవింగ్ నైపుణ్యం గురించి ఇలాగే మాట్లాడేవారాని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణానది, కొండవీటి వాగుకు వరదలొస్తే.. అమరావతి మునిగిపోతుందా? ఎన్‌జీటీలో..?