కృష్ణానది, కొండవీటి వాగుకు వరదలొస్తే.. అమరావతి మునిగిపోతుందా? ఎన్‌జీటీలో..?
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని నగరంగా అమరావతి మారింది. ఈ నగర నిర్మాణంలో పలు విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో కానీ.. అమరావతికి వచ్చే ముప్పేంటో నేషనల్ గ్రీన్ ట
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని నగరంగా అమరావతి మారింది. ఈ నగర నిర్మాణంలో పలు విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో కానీ.. అమరావతికి వచ్చే ముప్పేంటో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)లో పిటిషనర్ల వాదనలు హెచ్చరిస్తున్నాయి. కృష్ణానది, కొండవీటి వాగులకు వరదలు వస్తే.. అమరావతికి పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉందని... అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషనర్లు తెలిపారు.
అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది సంజయ్ పరేఖ్ తన వాదనలు వినిపిస్తూ కృష్ణానది, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి ముప్పు తప్పదని వాదించారు. శివరామకృష్ణన్ సిఫార్సులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని ఫరేఖ్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేసింది.