Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధికారంలోకి వస్తే పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గిస్తాం : ప్రధాని మోడీ ఎన్నికల హామీ

Advertiesment
rajnath - modi

వరుణ్

, ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (12:56 IST)
గత పదేళ్లుగా ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేసిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 
 
ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, కీలకమైన నాలుగు స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టో 'సంకల్ప పత్ర'ను తయారు చేశామన్నారు. గరీబ్‌, యువశక్తి, అన్నదాత, నారీశక్తిని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారన్నారు. దేశ యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింభిస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. 
 
నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో ఆవిష్కరించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా పార్టీ ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ మేనిఫెస్టో కోసం యావత్తు దేశం వేచిచూసిందని మోడీ అభివర్ణించారు. పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. 
 
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించారు. దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అంకురాలకు మద్దతు, వివిధ రంగాల్లో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటుపై 'సంకల్ప పత్ర'లో దృష్టి సారించామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. వారందరూ మరింత ఉన్నతస్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌ను అరెస్టు చేసివుంటే ఖచ్చితంగా ప్రభావం చూపివుండేది : సీఎం రేవంత్ రెడ్డి