మణిపూర్‌లో బీజేపీ సర్కారు.. మద్దతు పలికిన ఎన్‌పీఎఫ్, ఎన్పీపీ, ఎల్జేపీ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాజకీయాలు ఊహించనిమలుపు తిరిగాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలోనే చేరిపోయింది. 4 స్థానాలున్న కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీపీ), ఒక స్థానమున్న
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాజకీయాలు ఊహించనిమలుపు తిరిగాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలోనే చేరిపోయింది. 4 స్థానాలున్న కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీపీ), ఒక స్థానమున్న మిత్ర పక్షం ఎల్జేపీ బీజేపీకి మద్దతు ప్రకటించాయి. మరో 4 స్థానాలున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) కూడా పరోక్షంగా బీజేపీకి సపోర్టు చేసింది. అదే సమయంలో టీఎంసీకి చెందిన ఒకే సభ్యుడు, కాంగ్రెస్ నుంచి మరో సభ్యుడు ఆదివారం బీజేపీలో చేరారు.
వీరి చేరికతో బీజేపీ బలం 21 (బీజేపీ)+4 (ఎన్పీఎఫ్)+4 (ఎన్పీపీ)+1 (ఎల్‌జేపీ)+1 (కాంగ్రె్‌స)+1 (టీఎంసీ) మొత్తం 32 సీట్లకు చేరింది. దాంతో మణిపూర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈ మేరకు గవర్నర్ నజ్మా హెప్తుల్లాను బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాగా, సోమవారం పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటామని బీజేపీ ప్రకటించింది.
మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో 28 గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 3 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే.. విపక్షాలు ఏవీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ చక్రం తిప్పారు. ఆదివారం ఇంఫాల్‌లోనే మకాం వేసి ఆయా పార్టీలతో చర్చలు జరిపారు. ఎన్‌పీపీ మద్దతు సాధించడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.