రేషన్ బియ్యం కార్డు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసిన సొసైటీ ప్రెసిడెంట్
మహిళలపై ఏదో ఒక విధంగా, ఎక్కడోచోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దళిత మహిళకు రేషన్ కార్డు ఇప్పిస్తానని నమ్మించిన బీజేపీ నేత... తన మహిళా స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. మధ్య
మహిళలపై ఏదో ఒక విధంగా, ఎక్కడోచోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దళిత మహిళకు రేషన్ కార్డు ఇప్పిస్తానని నమ్మించిన బీజేపీ నేత... తన మహిళా స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరెనా అనే ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లోని కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బీజేపీకి చెందిన సుమావళి భోజ్‌పాల్ జాడోన్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఈయన వద్దకు మోరెనా అనే ప్రాంతానికి చెందిన ఓ మహిళ వచ్చి రేషన్ బియ్యం ఇప్పించాలని కోరింది.
దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ ప్రెసిడెంట్.. రేషన్ బియ్యమెందుకు ఏకంగా రేషన్ కార్డు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ఆ మహిళను తన మహిళా స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.
అతని చెర నుంచి తప్పించుకుని బయటపడిన బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు ద్వారా తెలిసింది. తొలుత కేసు పెట్టని పోలీసులు ఫిర్యాదు పూర్వకంగానే నమోదుచేసుకున్నారు. కానీ, ఆ గ్రామ ప్రజల ఒత్తిడి మేరకు కేసు నమోదు చేశారు.