Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో బ్రహ్మచారులెక్కువ... అందుకే పెళ్లిళ్ల సీజన్‌‌లో నోట్ల రద్దు రాంగ్ నిర్ణయం : బాబా రాందేవ్

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీలో బ్రహ్మచారులెక్కువ అని... అందుకే పెళ్లిళ్

బీజేపీలో బ్రహ్మచారులెక్కువ... అందుకే పెళ్లిళ్ల సీజన్‌‌లో నోట్ల రద్దు రాంగ్ నిర్ణయం : బాబా రాందేవ్
, శుక్రవారం, 18 నవంబరు 2016 (12:55 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీలో బ్రహ్మచారులెక్కువ అని... అందుకే పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి రాంగ్ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. 
 
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివాహాలు జరుపుతున్న కుటుంబాలు ఒకేసారి రూ.2.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించాయి.
 
దీనిపై రాందేవ్ బాబా స్పందిస్తూ... పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీలోని బ్రహ్మచారులేనని ఛలోక్తులు విసిరారు. 'బీజేపీలో చాలామంది బ్రహ్మచారులే. అందుకే వారికి ఇది పెళ్లిళ్ల సీజన్‌ అని తెలియలేదు. అది వారి పొరపాటు' అంటు జోక్‌ చేశారు. '15 లేదా నెలరోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పెళ్లిళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవి కావు. ఈ నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగింది. చాలామంది కట్నం అడగటం లేదు' అని నవ్వుతూ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దుపై దద్ధరిల్లిన లోక్‌సభ.. 21కు వాయిదా వేసిన స్పీకర్