బిల్కిస్ బానో అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అలాగే 11మంది నిందితుల రిలీజ్ గురించి వివరణ ఇవ్వాలంటూ గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15 రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
గుజరాత్ ప్రభుత్వ తీరును విపక్షాలతో పాలు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అత్యాచార నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడకపోగా పైగా వారిని విడుదల చేయటమా? అని నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుదల గురించి వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు పలువురు. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు.