మానవత్వమా ఏదీ నీ చిరునామా? శవం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన ఖాకీలు...
బీహార్‌లో ఖాకీలు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఓ మృతదేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన ఘటన.. దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద
బీహార్‌లో ఖాకీలు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఓ మృతదేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన ఘటన.. దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శవాన్ని పరీక్షించి చూశారు. శవానికి కాళ్లూచేతులు కట్టి పోస్ట్‌మార్టానికి తరలించాల్సిందిపోయి....అందరూ చూస్తుండగా ఆ శవం మెడకు తాడు కట్టారు. కుక్కను ఈడ్చుకెళ్లినట్టు ముగ్గురు పోలీసులు ఆ తాడును పట్టుకుని ఈడ్చుకెళ్లారు. చనిపోయిన వ్యక్తి ఎలాంటి వాడైనా అంత్యక్రియలకు గౌరవప్రదంగా తీసుకెళ్లడం మన దేశ ఆచారం.
అలాంటి మన దేశంలో ఒక మనిషి చనిపోతే ఇంత ఘోరంగా అవమానిస్తారా అని ఆశ్చర్యం కలిగిస్తోంది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దారుణ దృశ్యాలు వైరల్ కావడంతో పై అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఘటనకు కారణమైన పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటువంటి ఘటనలెన్నో పోలీసుల కాఠిన్యానికి నిదర్శనంగా నిలవడంతోపాటు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.