ఫోన్ మాట్లాడుతూ అన్నం పెట్టలేదని భార్యను హతమార్చిన భర్త..
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా..
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా.. హ్యాపీగా ఫోన్ మాట్లాడుకున్న ఓ మహిళ భర్తచే హత్యకు గురైంది. అన్నం పెట్టమని పదే పదే అడిగినా.. ఫోన్ మాట్లాడుతూ.. భోజనం పెట్టడంలో ఆలస్యం చేసిన కారణంగా భర్త కోపంతో భార్యనే హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. శివమంగళ్ రామ్ అనే వ్యక్తి తన భార్య దుర్గాదేవిని భోజనం పెట్టాలని అడిగాడు. ఆమె భోజనం పెట్టకుండా ఫోన్ మాట్లాడుతూ ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన శివమంగళ్ రామ్ ఆమెను హాత్యచేశాడు. దుర్గాదేవిపై ఆమె భర్త దాడి చేసే సమయంలో బందువులు అడ్డుకోబోయారు. వారిలో ఒకరిని శివమంగళ్ రామ్ గాయపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.