Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్ - కుప్పకూలిపోతుంది.. ఆర్జేడీ!

Advertiesment
Bihar
, ఆదివారం, 15 నవంబరు 2020 (14:08 IST)
బీహార్ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఎన్నిక‌య్యారు. ఆదివారం పాట్నాలో జ‌రిగిన ఎన్డీఏ కూట‌మి ఎమ్మెల్యేల‌ స‌మావేశంలో నితీశ్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. నితీశ్‌ కుమార్ నివాసంలో జ‌రిగిన స‌మావేశానికి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీల ఎమ్మెల్యేలు, నేత‌లు హాజ‌ర‌య్యారు.
webdunia
 
ఎన్డీఏ కూట‌మి ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రిగా ఎన్నుకోవ‌డంతో నితీశ్‌ కుమార్ ఏడోసారి బీహార్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. అంత‌కుముందు బీజేపీ, జేడీయూతోపాటు హెచ్ఏఎమ్‌, వీఐపీ పార్టీల‌ ఎమ్మెల్యేలు వేర్వేరుగా స‌మావేశ‌మై త‌మ నేత‌ల‌తో త‌దుప‌రి సీఎం ఎన్నిక‌పై చ‌ర్చించారు. అనంత‌రం కూట‌మిల ఎమ్మెల్యేలంతా క‌లిసి త‌దుప‌రి సీఎంగా నితీశ్‌కుమార్ పేరును ప్ర‌క‌టించారు.
 
మరోవైపు, బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న నితీశ్ కుమార్‌పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత మనోజ్ కుమార్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ప్రభుత్వం ఎంతోకాలం మనలేదని జోస్యం చెప్పారు. మహాఘట్‌బంధన్ నుంచి నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)లోకి మారడం ద్వారా 2017లో ప్రజలు ఇచ్చిన తీర్పును నితీశ్ కాలరాశారని మనోజ్ కుమార్ మండిపడ్డారు.
webdunia
 
బీహార్ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారని అన్నారు. తాజా ఎన్నికల్లో నితీశ్ 40 సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని, స్వల్ప మెజారిటీతో గద్దెనెక్కే ప్రభుత్వం పూర్తికాలం మనలేదని పేర్కొన్నారు. ఆర్జేడీపై గెలిచిన అభ్యర్థులకు అతి తక్కువ మెజారిటీ ఓట్లు రావడంపై తాము ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు ఝా చెప్పారు. 'ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. జవాబుదారీతనం కోరుతూ రాబోయే రోజుల్లో వీధుల్లోకి వస్తారు' అని నితీశ్‌ను హెచ్చరించారు. 
 
కాగా, శుక్రవారం గవర్నర్‌ ఫగు చౌహాన్‌ను కలిసిన నితీశ్ తన రాజీనామాను సమర్పించారు. మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 40 సీట్లు గెలుచుకున్న వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఝా.. నియంత్రణ, స్క్రిప్ట్ అంతా బీజేపీదేనని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 74 స్థానాలు గెలుచుకోగా, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5.30 కోట్లు.. భారత్‌లో..