బీహార్లో సీరియల్ కిస్సర్ కలకలం రేపుతున్నాడు. అమ్మాయిలే వాడి టార్గెట్. ఒంటరిగా దొరికితే చాలు పండుగ చేసుకుంటున్నాడు. వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. తిరిగి చూసేలోపే పారిపోతాడు.
వివరాల్లోకి వెళితే.. బీహార్లోని జమై సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ మహిళ మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకు వచ్చింది. ఇంతలో ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముందుకు వెళ్లి గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.
తనకు జరిగిన అకృత్యాన్ని తలచి తేరుకునే లోపే.. ఆ కుర్రాడు జంప్ అయ్యాడు. దీంతో మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.