ఛాన్స్ కోసమెచ్చిన నటిపై దర్శకుడి అత్యాచారం.. కోర్టులో కేసు కొట్టివేత.. ఎలా?
ఓ యవతి సినీ దర్శకుడిపై పెట్టిన అత్యాచార కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సినీ ఛాన్సుల కోసం వచ్చిన ఆ యువతి ఇష్టపూర్వకంగానే దర్శకుడికి పడకసుఖం అందించిందని డిఫెన్స్ లాయర్ తన వాదనలతో నిరూపించాడు.
ఓ యవతి సినీ దర్శకుడిపై పెట్టిన అత్యాచార కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సినీ ఛాన్సుల కోసం వచ్చిన ఆ యువతి ఇష్టపూర్వకంగానే దర్శకుడికి పడకసుఖం అందించిందని డిఫెన్స్ లాయర్ తన వాదనలతో నిరూపించాడు. అంటే తన క్లెయింట్ అయిన దర్శకుడు, బాధిత యువతి పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును కొట్టివేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
2009 జూలై 21న తన సినిమాలో 'ఐటెం గర్ల్' అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్ తన కార్యాలయానికి పిలిచారు. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు డ్యాన్స్ రిహార్సల్ పేరిట పిలిచి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ అవకాశం మరో యువతికి ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ దర్శకుడి పేరు రాంకుమార్ కుమావత్. వయసు 51 యేళ్లు. ఈయన భోజ్‌పురి ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తానని పేర్కొంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.
కాగా, ఈ కేసు విచారణ ముంబై సెషన్స్ కోర్టులో సాగింది. ఈ కేసు విచారణ సందర్భంగా సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను ఆయన ఇంటికి వెళ్లానని, సినిమాలో తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాన్ని కాదని డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆమె తెలిపింది. అంతేకాకుండా ఆమె శరీర భాగాలపై ఉన్న గాయాలు కూడా కల్పితమైనవేనని వైద్యనివేదికలో తేలింది. దీంతో వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని నిర్ధారించిన న్యాయస్థానం, ఆ కేసును కొట్టివేసింది.