Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తు.. పెళ్లి ఊరేగింపును మరిచిపోయాడు.. తర్వాత ఏమైందంటే?

marriage
, శుక్రవారం, 17 మార్చి 2023 (09:23 IST)
బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉంది. అయినా మద్యపాన సేవనం ఆగట్లేదు. ఫలితంగా మద్యం మత్తులో జీవితాలను కోల్పోతున్నారు. భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తంగంజ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఒక యువకుడు తన పెళ్లి ఊరేగింపుకు వెళ్లడం మర్చిపోయాడు. 
 
మరుసటి రోజు మత్తు తగ్గడంతో బంధువుల ఒత్తిడితో పెళ్లికి వెళ్లగా.. ఆపై పెళ్లికి యువతి నిరాకరించింది. అంతేకాదు పెళ్లికి చేసిన ఖర్చును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెళ్లికొడుకును, అతని సహోద్యోగిని కూడా బందీలుగా ఉంచారు యువతి బంధువులు. 
 
విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లికి ముందు పెళ్లికొడుకు మద్యం సేవించాడు. అంతే స్పృహ కోల్పోయాడు.  అంతే పెళ్లి ఊరేగింపుకు రాలేకపోయాడు. పదేపదే కాల్ చేసినప్పటికీ, పెళ్లి కొడుకు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. 
 
ఊరేగింపు సోమవారమే వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం వరకు కూడా చేరుకోలేదు. మరుసటి రోజు, అమ్మాయి తరపువారు సంప్రదించడంతో, బంధువుల ఒత్తిడితో, వరుడు ఎలాగోలా పెళ్లికి సిద్ధమయ్యాడు.
 
తన సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఈసారి అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని సహాయకుడిని బందీలుగా ఉంచి పెళ్లికి ఖర్చు చేసిన డబ్బును డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలు.. ఆరు జిల్లాల రైతులకు భారీ నష్టం