Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

Advertiesment
romance

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:29 IST)
తన బిడ్డను స్కూలులో వదిలిపెట్టేందుకు వచ్చే విద్యార్థి తండ్రితో పరిచయం పెంచుకున్న ఓ టీచర్‌తో అఫైర్‌ పెట్టుకుంది. ఆ తర్వాత అతని ప్రైవేట్ ఫోటోలు తీసి, ఆన్‌లైన్‌లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయురాలిన బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారి భార్య, ముగ్గురు కుమార్తెలతో జీవిస్తున్నారు. ఐదేళ్ల చిన్న కుమార్తెను 2023లో స్కూల్‌ చేర్చారు. అడ్మిషన్ సమయంలో ఆయనకు ఉపాధ్యాయురాలు శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. 
 
ఈ పరిచయం పెరిగి పెద్దది కావడంతో తరచూ వీడియో కాల్స్ చేసుకునేవారు. మేసేజ్‌లు పంపుకునేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్, సిమ్ కార్డు కూడా తీసుకున్నారు. ఆ పరిచయం మరింత పెరగడంతో అవసరం పేరుతో ఆయన నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. ఈ జనవరిలో మరో రూ.15 లక్షలు అడిగింది. ఇచ్చేందుకు ఆయన వెనుకంజ వేయడంతో రూ.50 వేలు అప్పు తీసుకునే నెపంతో ఆమె ఆయన ఇంటికి నేరుగా వెళ్లింది. 
 
మరోవైపు, ఆయన వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో కలిసి తిరిగి గుజరాత్‌కు వెళ్ళిపోలాని నిర్ణయించుకున్నారు. దీంతో కుమార్తె ట్రాన్సఫర్ సర్టిఫికేట్ అవసరమైంది. ఇందుకోసం గత నెలలో ఆయన స్కూలుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ గణేశ్ కాలే (38), సాగర్ (28)లు ఉన్నారు. స్కూలుకు వెళ్ళిన ఆయనకు తేరుకోలేని షాక్ తగిలింది. 
 
శ్రీదేవితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియలో చూపించి వారు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వాటిని ఆయన కుటుంబానికి పంపుతామని బెదిరించారు. దీంతో ఆయన తన పరిస్థితి వివరించి రూ.15 లక్షలకు వారికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులోభాగంగా తొలుత రూ.1.9 లక్షలు బదిలీ చేశాడు. 
 
మార్చి 17వ తేదీన శ్రీదేవి ఆయనకు ఫోన్ చేసి మిగతా డబ్బు కోసం గుర్తు చేసింది. దీంతో ఇక లాభం లేదని ఆయన పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీదేవి, సాగర్ కాలెలను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం