Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య అందవికారంగా ఉంటే ఎవరు చూడరనీ.. కన్ను పీకేసిన సైకో భర్త.. ఎక్కడ?

సాధారణంగా భార్య అందంగా ఉండాలని ప్రతి పురుషుడూ కోరుకుంటారు. అలాంటి అందమైన అమ్మాయి కోసం చెప్పులరిగేలా తిరిగిమరీ ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంటుంటారు. కానీ, ఈ సైకో భర్త మాత్రం.. తన భార్య అందంగా ఉందనీ, ప్

Advertiesment
Bengaluru
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:20 IST)
సాధారణంగా భార్య అందంగా ఉండాలని ప్రతి పురుషుడూ కోరుకుంటారు. అలాంటి అందమైన అమ్మాయి కోసం చెప్పులరిగేలా తిరిగిమరీ ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంటుంటారు. కానీ, ఈ సైకో భర్త మాత్రం.. తన భార్య అందంగా ఉందనీ, ప్రతి ఒక్కరూ ఆమెనే చూస్తున్నారని భావించి ఆమెను అందవికారంగా చేశాడు. ఇందుకోసం ఏకంగా ఆమె కన్నే పీకేశాడు ఆ సైకో మొగుడు. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిశాకు చెందిన మున్నా, రాధా దంపతులు 15 రోజుల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వచ్చి నాగేనహళ్లిలో అద్దెకుంటున్నారు. ఇద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో హౌస్‌ కీపింగ్‌ పనికి కుదిరారు. ఆఫీసులో తన భార్యను ఇతరులు చూస్తున్నారని అతడు కినుక వహించాడు. మంగళవారం ఇంటికి వెళ్లిన దంపతులు దీనిపై గొడవపడ్డారు. బుధవారం ఉదయం మళ్లీ వారిమధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మున్నా భార్య కంటిని కత్తితో పీకేసి ఉడాయించాడు. బాధితురాలిని గమనించిన స్థానికులు తక్షణం బాప్టిస్ట్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సైకో భర్త కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. కానీ?