Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నమ్మను జైలులో 31 రోజుల్లో 19మంది కలిశారట.. నిబంధనల్ని ఉల్లంఘించారట!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ... అన్నాడీఎంకే పార్టీని చీల్చేసింది. అమ్మ మరణానికి తర్వాత తమిళనాట చిన్నమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే తరహా

చిన్నమ్మను జైలులో 31 రోజుల్లో 19మంది కలిశారట.. నిబంధనల్ని ఉల్లంఘించారట!
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:28 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ... అన్నాడీఎంకే పార్టీని చీల్చేసింది. అమ్మ మరణానికి తర్వాత తమిళనాట చిన్నమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే తరహాలోనే శశికళ జైలులో ఓవరాక్షన్ చేసిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ వివరాలు సమాచార చట్టం ప్రకారం.. బహిర్గతమైనాయి. 
 
బెంగళూరులో జైలులో శశికళ ప్రత్యేక సదుపాయాలు కావాలని విన్నవించుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్, మంచం, ఇంటి భోజనం కావాలని కోరారు. అయితే అందుకు అనుమతి లభించలేదు. ఇంకా రాజకీయ నేత కావడంతో కార్యకర్తలు తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని శశికళ పట్టుబట్టారు. జైలు నిబంధనల ప్రకారం ఒక నెలకు ఇద్దరు విజిటర్స్ మాత్రమే కలిసేందుకు అనుమతి ఉంటుంది. 
 
కానీ శశికళ ఈ నిబంధనను ఉల్లంఘించారు. 31 రోజుల్లో ఆమెను 19 మంది జైలులో కలిశారు. అందులో శశికళ భర్త నటరాజన్ చిన్నమ్మకు కలిసేందుకు పలుమార్లు జైలుకెళ్లారు. ఇదేవిధంగా దినకరన్, చిన్నమ్మ బంధువులు చిన్నమ్మను జైలులో కలిశారు. 
 
ఈ విషయాన్ని సామాజిక వేత్త నరసింహ మూర్తి బహిర్గతం చేశారు. జైలు నిబంధనలను ఉల్లంఘించిన శశికళతో పాటు ఆమెకు వంతపాడిన జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసు శాఖకు లేఖ కూడా రాశారు. జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికల కాళ్లు కడిగి.. పసుపు పూసి... పాదపూజ చేసిన సీఎం యోగి