Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చనిపోతానని తల్లిదండ్రులను బెదిరించింది... ఉరేసుకుంది.. తాడు బిగుసుకుపోవడంతో?

ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న 18 ఏళ్ళ కీర్తన ఇంటికి ఆలస్యంగా వస్తోందని ప్రతి రోజు తల్లిదండ్రులు మందలించేవారు. బుధవారం కూడా వారు అలాగే అడగ్గా ఆత్మహత్యాయత్నంతో బెదిరించేందుకు కీర్తన ప్రయత్నించింది. తల్లి

చనిపోతానని తల్లిదండ్రులను బెదిరించింది... ఉరేసుకుంది.. తాడు బిగుసుకుపోవడంతో?
, గురువారం, 12 జనవరి 2017 (18:47 IST)
ప్రేయసి లేకపోతే తాను బతకలేనని చెప్పిన మాట ఆమెను నమ్మించలేకపోయింది. దీంతో తాను చేసిన ప్రయత్నం పొరపాటున బెడిసికొట్టడంతో ప్రేయసి కళ్ల ముందే యువకుడు ముంబైలో మృతిచెందాడు. నువ్వు లేకపోతే నేను లేను అంటూ రాణే తన ప్రేయసికి చెప్పాడు. ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. నీకోసం చావనైనా చస్తాను కానీ నిన్ను విడిచి ఉండలేనని చెప్పాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. కుర్చీపై నిలబడి నిజంగానే చనిపోతాను అంటూ ఆ యువతిని ఆటపట్టించాడు. ప్రమాదవశాత్తూ అతడి కాళ్ల కింద ఉన్న కుర్చీ పక్కకు జరిగింది. అంతే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఇలాంటి ఘటన కర్ణాటర రాజధాని బెంగళూరులో బుధవారం చోటుచేసుకుంది. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న 18 ఏళ్ళ కీర్తన ఇంటికి ఆలస్యంగా వస్తోందని ప్రతి రోజు తల్లిదండ్రులు మందలించేవారు. బుధవారం కూడా వారు అలాగే అడగ్గా ఆత్మహత్యాయత్నంతో బెదిరించేందుకు కీర్తన ప్రయత్నించింది. తల్లిదండ్రుల ఎదుట వేసుకున్న ఉరి బిగుసుకుపోవడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుతో పన్నీర్ సెల్వం చర్చలు సఫలం.. తెలుగు గంగ నుంచి నీరిస్తారా? సహారా డైరీలో బాబు పేరు?