Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజులో హెయిర్ బాల్.. అవాక్కైన వైద్యులు.. ఎక్కడ?

hair ball

ఠాగూర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (11:45 IST)
ఓ బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజులో వెంట్రుకల గడ్డ (హెయిర్ బాల్)ను వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా బాల్‌ను తొలగించారు. దీన్ని చూసిన వైద్యులు అవాక్కయ్యారు. ట్రైకోఫాగియా అనే వ్యాధితో బాధిత బాలిక బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి ఉన్నవారికి వెంట్రుకలు తినే అలవాటు ఖచ్చితంగా ఉంటుందని, అందువల్లే ఆ బాలిక కడుపులో ఈ హెయిర్ బాల్ తయారై వుంటుందని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని ఆస్టర్స్ చిల్డ్రెన్స్ అండ్ ఉమెన్ ఆసుపత్రి వైద్యులు బాలికకు అరుదైన ఆపరేషన్ చేసి హెయిర్ బాల్‌ను వెలికి తీశారు. 
 
బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని, ఈ వ్యాధి ఉన్నవారికి జుట్టు తినే కంపల్సివ్ అలవాటు ఉంటుందని, దీన్ని రాపుంజెల్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారని వైద్యులు వివరించారు. ఇక బాధిత బాలిక గత రెండేళ్లుగా ఆకలి లేకపోవడం, తరచుగా వాంతులు చేసుకోవడం వంటివి చూసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దాంతో వారు ఆమెను పీడియాట్రిషియన్లు, జనరల్ ఫిజిషియన్లు, ఈఎన్టీ స్పెషలిస్టులతో సహా అనేక మంది వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. కానీ, ఎలాంటి ఫలితం దక్కలేదు. 
 
ఎక్కడికెళ్లినా బాలిక ఆరోగ్య పరిస్థితిని గ్యాస్ సమస్యగా భావించి దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చి పంపేవారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఆస్టర్స్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ ఆసుపత్రిలోని వైద్యులు ఆమెకు ట్రైకోబెజోర్ ఉన్నట్లు గుర్తించారు. బాలిక జీర్ణాశయాంతర ప్రేగులలో భారీ మొత్తంలో జుట్టు పేరుకుపోయినట్లు గుర్తించి వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేశారు. ఓపెన్ స్టమక్ ఆపరేషన్ చేసి హెయిర్ బాల్‌ను తొలగించారు.
 
'ట్రైకోబెజోర్ అనేది చాలా అరుదైనది. ముఖ్యంగా చిన్న పిల్లలలో చాలా అరుదు. ఇది తరచుగా ట్రైకోఫాగియాతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది వ్యక్తులు జుట్టును తినే మానసిక రుగ్మతకు దారితీస్తుంది. సాధారణంగా యుక్తవయస్సులో ఉన్న బాలికలలో కనిపిస్తుంది. కానీ, చాలా చిన్న పిల్లలలో కనుగొనడం ఈ కేసు ప్రత్యేకత' అని పీడియాట్రిక్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజీరి సోమశేఖర్ ఐఏఎన్ఎస్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ వల్ల వైకాపా ఓడిపోలేదు ... సకల శాఖామంత్రి : అధికార ప్రతినిధి (Video)