ఢిల్లీలోని బీర్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఢిల్లీలో బీరు సీసాల్లో కాకుండా అప్పటికప్పుడు మగ్గుల్లో పట్టి సప్లై చేస్తారు. ఇది కూడా ఒక రకంగా బార్‌లాంటిదే. ఇక్కడ బీర్ తయారవుతుంది. దీనినే మైక్రో బ్రూవరీ అంటారు. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఇలాంటి మైక్రో బ్రూవరీలు పనిచేస్తున్నాయి.
కాగా, ఇప్పుడు ఢిల్లీలో మరిన్ని మైక్రోబ్రూవరీలు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి. సాకేత్, నగరంలోని మరో నాలుగు ప్రాంతాల్లో మైక్రోబ్రూవరీలను తెరవడానికి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ లైసెన్స్ జారీ చేసింది.
ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం.. మైక్రో బ్రూవరీస్‌లో ఉదయం 11.00 నుండి 01.00 వరకు లేదా రెస్టారెంట్, హోటళ్లు లేదా ఎయిర్‌పోర్ట్‌లో మద్యం అందించడానికి అనుమతించబడే వరకు తెరవడానికి అనుమతించబడుతుంది.