Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డుల మోత మోగిస్తున్న బీబీసీ.. వీక్షకుల సంఖ్య 426 మిలియన్లకు చేరిక..

Advertiesment
రికార్డుల మోత మోగిస్తున్న బీబీసీ.. వీక్షకుల సంఖ్య 426 మిలియన్లకు చేరిక..
, బుధవారం, 19 జూన్ 2019 (16:05 IST)
బీబీసీకి అంతర్జాతీయ ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు గతంలో కంటే బీబీసీలో ట్యూన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వారం బీబీసీ 426 మిలియన్ల కొత్త ఆడియన్స్‌ను కొల్లగొట్టింది.

తాజాగా విడుదల చేసిన కొత్త గణాంకాల ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది.. 50 మిలియన్ల అధిక ప్రేక్షకులతో 13 శాతం వృద్ధిని గడించింది బీబీసీ. గ్లోబల్ ఆడియన్స్ మెషర్ (జీఏఎమ్) ప్రకారం బీబీసీ న్యూస్ 394 మిలియన్ల ప్రేక్షకులను కలిగివుంది. ప్రస్తుతం 47 మిలియన్ల పెరుగుదలను బీబీసీ వర్డల్డ్ ప్రకటించింది. బీబీసీ భారతీయ భాషలతో పాటు బీబీసీ వరల్డ్ న్యూస్ టీవీ ఛానల్ కూడా ఆల్ -టైమ్ రికార్డును బ్రేక్ చేశాయి. బీబీసీ వరల్డ్ న్యూస్ 50మిలియన్, టీవీ 101 మిలియన్ల ప్రేక్షకులను సంపాదించింది. 
 
బీబీసీ వరల్డ్ సర్వీస్ 42 భాషల్లో కొనసాగుతోంది. ఇది 259 మిలియన్లకు చేరింది. బీబీసీ న్యూస్, బీబీసీ వరల్డ్ న్యూస్ మరియు బీబీసీడాట్‌కామ్‌లతో కూడిన వ్యవస్థ ప్రేక్షకులను భారీ సంఖ్యలో చూరగొంది. ముఖ్యంగా బీబీసీ డిజిటల్ టీవీ 6ఎమ్ నుంచి 121 మిలియన్ల గరిష్ఠ స్థాయి రికార్డుకు చేరుకుంది. ఓవరాల్‌గా బీబీసీ న్యూస్ 23 మిలియన్ టీవీతో పాటు 214 మిలియన్‌కు పెరుగగా, 12 మిలియన్ నుంచి 178కి ఆడియో పెరిగింది. అలాగే ఆన్‌లైన్ విభాగంలో 18 ఎమ్ నుంచి 95మిలియన్లకు పెరిగింది. 
 
బీబీసీ డైరక్టర్ జనరల్ టోనీ హాల్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ తమ బృందం అద్భుతమైన, స్వతంత్ర్యమైన, కీలకమైన వార్తలను ప్రేక్షకుల కోసం ప్రచురిస్తున్నామని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పని కొనసాగుతోందని.. అందుకే బీబీసీ విలువ పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ అగ్రగామిగా ఎదిగేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ప్రభుత్వ పెట్టుబడితో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సంస్థ బీబీసీ ప్రారంభించడంతో పాటు దాని విస్తరణకు కూడా సహకరించిందన్నారు. 
 
2018వ సంవత్సరం భారత్, కెన్యా, యూఎస్ఏ అనే మూడు దేశాల్లో బీబీసీ మంచి లాభాలను గడించింది. ప్రస్తుతం బీబీసీ న్యూస్ తొమ్మిది భాషల్లో కొనసాగుతోందని.. దీని లాభం 20 మిలియన్ల నుంచి 50 మిలియన్లకు చేరింది. అమెరికా బీబీసీ వృద్ధిరేటు 5 మిలియన్ల నుంచి 38మిలియన్లకు చేరింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా మూడవ అతిపెద్ద మార్కెట్‌ అమెరికాలో బీబీసీకి వుందని బీబీసీ డైరక్టర్ జనరల్ టోనీ హాల్ చెప్పుకొచ్చారు. కెన్యాలో 6 మిలియన్ల నుంచి 15 మిలియన్లకు చేరడం ద్వారా 50శాతం జనాభా పెరిగిందన్నారు. అలాగే ఆఫ్గాన్‌లో 59శాతం పెరిగింది. ఇక బీబీసీ న్యూస్ వెబ్ సైట్లు (వరల్డ్ సర్వీస్ అండ్ బీబీసీడాట్‌కామ్) కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను 6ఎమ్ నుంచి 51ఎమ్‌గా పెంచుకుంది. 
webdunia
 
టాప్-10 బీబీసీ న్యూస్ ఆడియన్స్ వివరాల్లోకి వెళితే.. 
భారత్ 50 మిలియన్లు 
నైజీరియా 41 మిలియన్లు
అమెరికా 38 మిలియన్లు 
కెన్యా 15 మిలియన్లు 
ఆప్ఘనిస్తాన్ 12 ఎమ్ 
బంగ్లాదేశ్ 12 ఎమ్ 
ఈజిప్టు 11 ఎమ్ 
ఇరాన్ 11 ఎమ్ 
టాంజానియా 10 ఎమ్ 
పాకిస్థాన్ 9 ఎమ్
 
న్యూస్ సర్వీసుల్లో యూకే అండ్ బ్రాండెడ్ ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను బీబీసీ కలిగివుంది. టీవీ, బీబీసీ, వెబ్ సైట్లు, సోషల్ మీడియా పేజ్‌లను బీబీసీ స్టూడియోస్ కోసం సిద్ధం చేస్తున్నాయి. ఇంకా బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా రేడియో స్టేషన్లు, యూట్యూబ్, ఫేస్‍బుక్ వంటివి కూడా వున్నాయి. వీటిద్వారా  60శాతం ఆడియన్స్ రీచ్ పెరిగింది. 
 
అలాగే ఆడియో పరంగా బీబీబీ ప్రపంచ వ్యాప్తంగా 12.9 నుంచి 173 శ్రోతలను కలిగివుంది. అన్నీ విభాగాల్లోనూ బీబీసీకి 30శాతం ప్రేక్షకులు 15-24 ఏళ్లో లోపు వారేనని బీబీసీ జనరల్ టోనీ వెల్లడించారు. గత రెండేళ్లలో బీబీసీ న్యూస్ బ్యూరోలు భారత్, కెన్యా, నైజీరియా, దక్షిణాప్రికా వంటి 12 భాషల్లో సేవలు అందించింది. 1940 నుంచి బీబీసీ సేవలు జరుగుతున్నాయని.. బీబీసీ వ్యవస్థాపకులు యూకే ప్రభుత్వమేనని.. తమ సంస్థ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు అదే కారణమైందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం.. హత్య