Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బార్ గర్ల్‌పై అత్యాచారం.. బెంగళూరులో దారుణం.. మత్తు పానీయం ఇచ్చి?

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఐటీ నగరమైన బెంగళూరులో యువతులపై లైంగిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మహిళలకు బెంగళూరులో భద్రత కరువైంది. ఐటీ రంగంలో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన బ

Advertiesment
BAR WOMAN
, శనివారం, 11 మార్చి 2017 (11:13 IST)
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఐటీ నగరమైన బెంగళూరులో యువతులపై లైంగిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మహిళలకు బెంగళూరులో భద్రత కరువైంది. ఐటీ రంగంలో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన బెంగళూరు నగరం అత్యాచారాలకు నిలయంగా మారి, చెడ్డ పేరును మూటగట్టుకుంటోంది. మహిళలపై అత్యాచారాలు జరగడం బెంగళూరులో సర్వసాధారణమయింది. 
 
తాజాగా నగరంలోని రామమూర్తి నగర్‌లో ఓ బార్ గర్ల్‌పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్‌లో ఉన్న ఓ బార్‌లో పనిచేస్తున్న యువతికి చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి మత్తు పానీయం ఇచ్చి, ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై ఆమె రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 5వ తేదీన ఈ అత్యాచారం జరిగింది. పోలీసులు చక్రధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

రేప్‌తో పాటు తాను వెళ్లే ప్రాంతాలకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అత్యాచార వీడియోను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నాడని.. యాసిడ్‌తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు ఆమె చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల ఫలితాలు : మణిపూర్‌లో ఓడిన ఉక్కు మహిళ ఇరోం షర్మిల, గోవాలో లక్ష్మీకాంత్ పర్సేకర్