బెంగళూరును వణికిస్తున్న లవర్స్... పోలీసులకు లేడీ గ్యాంగ్ లీడర్ సుమ సవాల్
ఆ ప్రేమికులు ఇప్పుడు బెంగళూరు నగరానికి సవాలుగా మారారు. జైలు గోడల మధ్య నుంచి వారి ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఐతే పెళ్లితో ఒకటైన వీరిద్దరూ బెంగళూరు నగర పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఇంతకీ ఏంటీ క్రైమ్ లవ్ స్టోరీ అని చూస్తే, 2011లో పరప్పనా అగ్రహారా
ఆ ప్రేమికులు ఇప్పుడు బెంగళూరు నగరానికి సవాలుగా మారారు. జైలు గోడల మధ్య నుంచి వారి ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఐతే పెళ్లితో ఒకటైన వీరిద్దరూ బెంగళూరు నగర పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఇంతకీ ఏంటీ క్రైమ్ లవ్ స్టోరీ అని చూస్తే, 2011లో పరప్పనా అగ్రహారా జైలులో నగరంలో దోపిడీ ముఠాలకు పెద్ద నాయకుడిగా ఉన్న కోటిరెడ్డి అరెస్టయ్యాడు. అతడిని కలిసేందుకు అతడి సోదరి సుమ తరచూ జైలుకు వస్తుండేది.
అలా వస్తూ జైలులో ఉన్న మరో రౌడీ షీటర్, పిల్లికళ్లతో ఉన్న రాజా ప్రేమలో పడింది. అతడిని ప్రేమిస్తున్నట్లు జైలు ఊచల మధ్యే తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడు సంతోషానికి అవధుల్లేవు. జైలు నుంచి విడుదల కాగానే ఆమెను పెళ్లాడాడు. ఆ తర్వాత ఇక వారి నేర సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరిస్తూ వెళ్లిపోయింది. ఐతే రాజా ఓ రాజకీయ నాయకుడి హత్య కేసులో అరెస్టయి మళ్లీ జైలుకెళ్లాడు. దీనితో భర్త స్థానాన్ని భార్య సుమ తీసుకున్నది.
భర్త స్కెచ్‌లను పక్కాగా పాటిస్తూ లేడీ గ్యాంగ్ లీడర్‌గా మారిపోయింది. ఆమె అనుచరులను పోలీసులు పట్టుకోగలుగుతున్నారు కానీ ఇప్పటివరకూ లేడీ గ్యాంగ్ లీడర్ సుమ ఆచూకి మాత్రం కనుగొనలేకపోయారు. ఆమె మాత్రం తనదైన స్టయిల్లో దోపిడీలకు పాల్పడుతూనే ఉంది. మరి బెంగళూరు పోలీసులు సుమను ఎప్పుడు పట్టుకుంటారో ఏమో?