Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

భార్యను వివస్త్రను చేసి వీడియో తీశాడు.. గుంటూరు సైకో టెక్కీ భర్త శాడిజం

Advertiesment
Bangalore
, శనివారం, 19 జనవరి 2019 (14:36 IST)
గుంటూరుకు చెందిన ఓ టెక్కీ సైకో భర్త శాడిజంతో కట్టుకున్న భార్య చిత్ర హింసలకు గురైంది. భార్య అనే విషయాన్ని కూడా మరచిపోయి నానా విధాలుగా వేధించాడు. భార్యను వివస్త్రను చేసి వీడియో తీశాడు. వరకట్న వేధింపుల్లో భాగంగా పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ... పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ గుంటూరు సైకో టెక్కీ భర్త వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ మోసర్తి అనే వ్యక్తి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మూడేళ్ళ క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూప అనే మహిళతో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం ఇచ్చారు. పైగా, అల్లుడు టెక్కీ కావడంతో పాటు తమ కుమార్తె భవిష్యత్ బాగుండాలని భావించిన అత్తింటివారు వివాహాన్ని ఆడంబరంగా చేశారు. 
 
ఆ తర్వాత ఈ దంపతులు బెంగుళూరులోని రామ్మూర్తినగర్‌లోని అన్నపూర్ణేశ్వరి లేఅవుట్‌లో నివశిస్తున్నారు. వీరి సంసార జీవితం కొంతకాలం బాగానే జరిగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను భర్త వేధించసాగాడు. భార్య తరపు బంధువులు వస్తే ఒక్క పూటకు మించి ఇంట్లో ఉండటానికి వీల్లేదంటూ షరతులు విధించేవాడు. ఈ వేధింపులు భరించలేని భార్య.. బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రదీప్‌కు గతంలోనే వివాహమైందని, ఈ విషయం దాచి అనూపను రెండో పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇంట్లోని వంటగది, హాల్‌, బెడ్రూంలలో కూడా అతను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చిత్ర హింసల్లో భాగంగా, వివస్త్రను చేసి వేధించేవాడనీ వెల్లడైంది. మొదటి భార్య కూడా ఈ వేధింపులు తాళలేకే వెళ్లిపోయినట్టు తేలడంతో సైక్ టెక్కీ భర్తీను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని కాదు బీజేపీ విధానాన్ని ఓడించాలి : యశ్వంత్ సిన్హా