Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త సంవత్సరం విందు కోసం మేకలను దొంగిలించిన పోలీసులు

కొత్త సంవత్సరం విందు కోసం మేకలను దొంగిలించిన పోలీసులు
, ఆదివారం, 2 జనవరి 2022 (09:33 IST)
సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రతి ఒక్కరూ మందు పార్టీలతో పాటు విందు పార్టీలను కూడా జరుపుకుంటారు. అయితే, ఈ పార్టీల కోసం కొందరు మేకలు, కోళ్లు, పొట్టేళ్ళను దొంగిలిస్తుంటారు. ఇలాంటి దొంగతనాలు జరుగకుండా అడ్డుకోవాల్సిన పోలీసులే మేకలను దొంగిలించారు. దీన్ని గమనించిన ఆ మేకల యజమానులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఏఎస్‌ఐను హత్య చేశారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బొలింగీర్ జిల్లాలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు అనే వ్యక్తి కొన్ని మేకలను పెంచుకుంటున్నాడు. ఈ మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. తీరా ఆరా తీస్తే పోలీసులే ఆ మేకలను దొంగిలించారని తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
ఆ రెండు మేకలను కోసేందుకు అప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. వీటిని చూసిన యజమాని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేకలను కోయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిపై తమ జులం ప్రదర్శించి బెదిరించారు. ఏం చేయాలో పాలుపోక గ్రామస్థులకు చెప్పారు. 
 
వారంతా వచ్చిన అడిగినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు కదా వారందరినీ బెదిరించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమై జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి చేరడంతో ఆయన విచారణకు ఆదేశించి, ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. మిగిలిన పోలీసులకు కూడా ఆయన గట్టి హెచ్చరిక చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా 32 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభం