Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెటప్ మార్చిన పోలీసులు.. 14 రోజుల పసికందును అమ్మకానికి పెట్టిన డాక్టర్‌ను పట్టేశారు.. ఎక్కడ?!

ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు.

Advertiesment
Baby selling racket: Doctor and Husband arrested for trying to sell 14-day old infant
, శుక్రవారం, 24 జూన్ 2016 (16:52 IST)
ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఇలా వేషధారణ మార్చడంతో రెండు వారాల శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన వైద్యురాలితో పాటు ఆమె భర్త కూడా పోలీసులు దొరికిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివగంగ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కోసం శాంచి అనే వైద్యురాలిని సంప్రదించింది. కానీ ఇప్పటికే 8 నెలలు నిండిపోవడంతో అబార్షన్ కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆ మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ శిశువు తనకు వద్దనడంతో అమ్మేందుకు వైద్యురాలు శాంతి ప్రయత్నించింది. 
 
కానీ సదరు ఆసుపత్రిలో శిశు విక్రయాల రాకెట్ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వేషం మార్చారు. దంపతుల గెటప్‌తో బాబును కొనుగోలు చేస్తామంటూ.. డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను ఆశ్రయించారు. శిశువును అమ్మేందుకు బేరం కుదరడంతో డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను పోలీసులు  రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంటోళ్ళను మా స్కూల్‌లో చేర్చుకోం.. టీసీ ఇచ్చి పంపేసిన హెచ్ఎం.. సూళ్లూరుపేటలో దారుణం