Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాశంలో జన్మించాడు.... బంపర్ ఆఫర్ కొట్టాడు.. జీవితాంతం ఉచిత ప్రయాణం

ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పుట్టిన పసిబిడ్డ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సౌదీ అరేబియా నుంచి భారతకు వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 9 డబ్ల్యూ 569 విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊహించని అతిథికి ఆ

ఆకాశంలో జన్మించాడు.... బంపర్ ఆఫర్ కొట్టాడు.. జీవితాంతం ఉచిత ప్రయాణం
, సోమవారం, 19 జూన్ 2017 (09:53 IST)
ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పుట్టిన పసిబిడ్డ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సౌదీ అరేబియా నుంచి భారతకు వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 9 డబ్ల్యూ 569 విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊహించని అతిథికి ఆ జెట్ ఎయిర్‌వేస్ సంస్థ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ విమానాలలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించేలా బర్త్‌ డే కానుకను ప్రకటించింది. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో డమ్మమ్‌ నుంచి కోచికి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అత్యవసర వైద్యసేవలు అవసరమయ్యాయి. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. విమానం అరేబియా సముద్రం గగనతలంపై 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగానే ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఫ్లైట్‌లో ఉన్న కేరళకు చెందిన నర్సు, విమాన సిబ్బంది కలసి సుఖ ప్రసవానికి సహాయపడ్డారు. ఆ తల్లి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆ తర్వాత విమానాన్ని కొచ్చికి కాకుండా ముంబైకి మళ్లించి ల్యాండింగ్ చేశారు. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి, 90 నిమిషాలు ఆలస్యంగా వెళ్లి కొచ్చిలో ఇతర ప్రయాణికులను దించింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఆ అనుకోని అతిథికి జీవితాంతం ఉచితంగా ప్రయాణ టికెట్లు ఇవ్వనున్నామని సంస్థ తెలిపింది. ఆ బిడ్డ ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన జాతి పాము... అచ్చం మనిషిలాగే ఆ సర్పానికి కాళ్లు.. కాలిగోళ్లు!