Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణ.. అద్వానీపై అభియోగాలు తప్పవా?

బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబ

Advertiesment
Babri Case
, గురువారం, 25 మే 2017 (13:34 IST)
బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణలో నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీకి కష్టాలు తప్పేలాలేవు. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అభియోగాలు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాబ్రీ కూల్చివేత అంశంలో అద్వానీతో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలపై వున్న కేసును 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే సీబీఐ దీన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో గత నెలలో సుప్రీం కోర్టు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించడంతో అద్వానీకి కొత్త చిక్కొచ్చి పడింది. అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీచేస్తారనుకున్న నేపథ్యంలో బాబ్రీ కేసు పునర్విచారణకు రావడం చర్చనీయాంశమైంది. 
 
బాబ్రీ కేసు విచారణను రెండేళ్లలోపు ముగించాలని కూడా సుప్రీం కోర్టు గత ఏప్రిల్ 19న సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వానీ సహా తదితరులపై కొత్తగా అభియోగాలు మోపవచ్చునని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ క్రాష్...